బాలయ్య, దాసరి జోడీ పొలిటికల్ టర్న్ అవుతుందా?

బాలయ్యతో తీస్తున్న పరమవీర చక్ర చిత్రం తనకు 150వ చిత్రం కావడాన్ని దాసరి నారాయణ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రాజకీయంగా బాలయ్యకు ఓ మలుపును, ఊపునిచ్చే సినిమాగా దాన్ని తీయాలనేది ఆయన ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవి నుంచి తాను తప్పుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెసు కల్పించడం ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు భావిస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కాంగ్రెసు పార్టీకి దగ్గర కావడం కూడా దాసరి బాలయ్యతో సినిమా తీసి రాజకీయ మార్పునకు దోహదం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు భావిస్తున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని, తాను కాంగ్రెసుతోనే ఉన్నానని దాసరి నారాయణ రావు చెబుతున్నప్పటికీ ఆయన సవాల్ గానే తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications