తెలంగాణ ఉప ఎన్నికలపై చంద్రబాబుకు చిక్కులు

Chandrababu Naidu
హైదరాబాద్‌: తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర సందిగ్ధంలో పడింది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని, క్యాడర్ పోటీ చేయాలంటోందని, కాంగ్రెసు పోటీ చేస్తున్నందున తాము పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. అయితే పార్టీ అభ్యర్థులను పోటీకి దింపి గెలిపించుకోవడం అంత సులభం కాదనే విషయాన్ని చంద్రబాబు గ్రహిస్తున్నట్లున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఉప ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను ఎవరు మోస్తారనే విషయంలో ఆయన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో చంద్రబాబు మనసు మార్చేందుకు తెలంగాణ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోటీ చేయవద్దని వారు గట్టిగా వాదిస్తున్నారు. పోటీ చేయడం వల్ల తమకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారు ఆ వాదనలను ముందుకు తెస్తున్నారు. పైగా, ప్రచారం చేయడానికి కూడా తెలంగాణ సీనియర్ నాయకులెవరూ సిద్ధపడడం లేదు. ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించకపోతే మొదటికే మోసం రావచ్చుననే భయం కూడా చంద్రబాబును పీడిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఉప ఎన్నికల్లో పోటీపై డైలమాలో పడినట్లు చెబుతున్నారు. అయితే ఈ సందిగ్ధత రెండు రోజుల్లో వీడిపోవచ్చునని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+