కెవిపి రామచంద్రరావు బినామీ కంపెనీకి పోలవరం పనులు: సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన మొత్తం పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలోని బినామీ కంపెనీకి కట్టబెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. బినామీ కంపెనీ మాత్రమే పనులను దక్కించుకునేలా టెండరు నిబంధనలను రూపొందించారని ఆయన అన్నారు. డ్యామ్‌ స్పిల్ ‌వే, రాక్ ‌ఫిల్‌ డ్యామ్‌ లకు 2005లో ఖరారు చేసిన అంచనాలను అమాంతం రూ.2 వేల కోట్లకు పెంచేశారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఈ అంచనాలను అంతగా ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండు చేశారు.

ఎనిమిది నెలల కిందట పోలవరం పనులకు సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. అయితే ఇందులో మొదటిసారిగా సాగునీటి శాఖకు చెందిన స్పిల్‌వే, రాక్ ‌ఫిల్‌ డ్యామ్‌లతో పాటు జెన్‌కోకు సంబంధించిన విద్యుత్‌ ప్రాజెక్టును కూడా కలిపి ఒకే టెండరు పిలవడం ప్రపంచంలోనే అతి పెద్ద వింత అని అన్నారు. పవర్‌హౌస్‌ పనికి టెండర్లు పిలిచి అమలు చేయించే అపారమైన అనుభవం, మౌలిక సౌకర్యాలు జెన్‌కోకు ఉన్నా, జెన్ ‌కోను విస్మరించారన్నారు. విద్యుత్‌ ప్రాజెక్టును...జలయజ్ఞంలో భాగంగా జరిగే సాగునీటి పనుల్లో కలిపేశారన్నారు. ఇలా కలిపేసి ఈ రెండు రంగాల్లో అనుభవం ఉన్న ఏకైక కంపెనీకి పనులను ఇచ్చేశారని, కేవీపీ బినామీ కంపెనీ కోసమే ఇలా చేశారని సోమిరెడ్డి తెలిపారు.

విదేశీ కంపెనీతో భాగస్వామ్యం ఉండొద్దంటూ మరొక నిబంధన కూడా పెట్టారని, ఇతర కంపెనీలను టెండరు ప్రక్రియ నుంచి దూరంగా ఉంచేందుకేనని చెప్పారు. ఇటీవల జాతీయ రహదారుల సంస్థ టెండర్లలో తలెత్తిన వివాదంలో ఒక అధికారిని, ఒక కాంట్రాక్టరును జైలుకు పంపారని గుర్తు చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీబీఐ, ఇతర కేంద్ర నిఘా సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి నిబంధనలతో ఖరారు చేసిన టెండర్ల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+