హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల్లో ఎలా గెలవాలో మాకు తెలుసు: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ఎలా గెలవాలో తమకు తెలుసునని ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తామని, అందుకు సంబంధించిన వ్యూహం తమ వద్ద ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎం చేస్తే గెలుస్తామో, ఎలా గెలుస్తామో తమకు తెలుసునని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి తమకు సొంత వ్యూహం ఉందని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికల్లో ఏ నినాదంతో పోటీ చేయాలో కూడా తమకు తెలుసునని, ఈ విషయంలో ఎవరి సలహాలు అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశలోనే తాము ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. ఎల్లుండి జరిగే తన ఢిల్లీ పర్యటనకు ఏ విధమైన ప్రాధాన్యం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X