హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగులో బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ముద్దులొలికే మాటలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Aishwarya Rai
హైదరాబాద్: బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ తెలుగులో ముద్దులొలికే పలుకులతో తెలుగు మీడియాను అలరించారు. మీ మధ్య ఉండడం నాకు సంతోషాన్నిస్తోందంటూ ఆమె ముద్ద ముద్దగా పలికారు. రావణ్ సినిమా ప్రమోషన్ కోసం దర్శకుడు మణిరత్నం, సహ నటులు విక్రమ్, ప్రియమణిలతో కలిసి ఆమె సోమవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదులో పెద్ద యెత్తున సందడి చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఐశ్వర్యారాయ్ చూసేందుకు అభిమానులు గుమిగూడారు. అనంతరం హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో మీడియా సమావేశం జరిగింది.

మీడియా సమావేశాన్ని మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని నిర్వహించారు. సుహాసిని పూర్తిగా తెలుగులో మాట్లాడారు. రావణ్ చిత్రంలోని పాత్రను తాను సవాల్ గా తీసుకున్నట్లు ఐశ్వర్యారాయ్ చెప్పారు. రావణ్ చిత్రానికి తెలుగులో విలన్ పేరు సూచించింది వేటూరి సుందర రామ్మూర్తియేనని మణిరత్నం చెప్పారు. చివరి పాట కూడా వేటూరి రావణ్ చిత్రానికే రాశారని ఆయన అన్నారు. రావణ్ చిత్రంలో గ్రాఫిక్స్ అబ్బుర పరుస్తాయని ఆయన అన్నారు.

మణిరత్నం సినిమాలో నటించడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రయమణి చెప్పారు. నటులు విక్రం, అభిషేక్ బచ్చన్ లతో నటించడం చాలా సులభంగా ఉందని ఆమె చెప్పారు. సినిమా గురించి విక్రమ్ కూడా వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X