ఆస్ట్రేలియాలో తారకరత్న, అఖిల్ క్రికెట్ శిక్షణ

Akhil AKkineni
హైదరాబాద్: టాలీవుడ్ టి20 క్రికెట్ పోటీల్లో ప్రొఫషనిలిజం కనిపించింది. ఆషామాషీగా కాకుండా సీరియస్ వ్యవహారంగా టాలీవుడ్ టీ20 పోటీలు జరిగాయి. చూసేవారికీ ఆడేవారికీ ఆ విషయం స్పష్టంగా తెలిసింది. కేవలం తారాబలంతో, ఇమేజ్ తో పోటీలను నెట్టుకొచ్చే ప్రయత్నం కాకుండా ఆటలో నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా ఆ క్రికెట్ పోటీలకు ఆకర్షణ తెచ్చారు. తారకరత్న, అక్కినేని అఖిల్, రాజీవ్ కనకాల, తరుణ్ వంటి సినీ నటులు సీరియస్ ఆటగాళ్లను తలపించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన క్రీడాకారుడిగా కనిపించాడు.

క్రికెట్ క్రీడలో చాలా మంది సినీ నటులు ప్రావీణ్యం సాధించిన విషయం ఈ పోటీలను చూస్తే అర్థమైంది. ఈ పోటీలకు వారంతా సీరియస్ గా ప్రాక్టీస్ చేశారనేది అర్థమవుతుంది. అంతేకాకుండా అక్కినేని అఖిల్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కొట్టేశాడు. తారకరత్న తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. వీరిద్దరు ఆస్ట్రేలియాలో శిక్షణ పొందారని సమాచారం. అందుకేనేమో పక్కా ప్రొఫెషనల్ ఆటగాళ్లను తలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+