రియల్ సీరియల్: టివీ ఆర్టిస్టు డింపుల్ పై కొరడా

టీవీ ఆర్టిస్టుల సంఘం నిర్ణయాన్ని సినీ నిర్మాతల మండలి ప్రతినిధి తమ్మారెడ్డి భరద్వాజ కూడా హర్షించారు. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో డింపుల్ కు స్థానం ఉండదని ఆయన చెప్పారు. సినిమా అవకాశాలు కూడా ఆమెకు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టీవీ ఆర్టిస్టు శ్రీధర్ వర్మపై దాడి చేయించడమే కాకుండా, ఆ దాడి కేసును మరో టీవి ఆర్టిస్టు సెల్వరాజ్ పైకి నెట్టేందుకు ప్రయత్నించినందుకు డింపుల్ కు తీవ్రమైన దెబ్బ తగిలింది.
డింపుల్ తీరుపై సెల్వరాజ్ తీవ్రంగా మండిపడుతున్నాడు. డింపుల్ పై పరువు నష్టం దావా వేస్తానని ఆయన చెబుతున్నారు. తన అవకాశాల కోసం డొంక తిరుగుడు పద్దతిలో వ్యవహరించడం గానీ, సహ టీవీ ఆర్టిస్టులపై ఆగ్రహంతో గానీ ఏనాడు వ్యవహరించలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications