కదిరి ఏడు కోట్ల డబ్బుతో చంద్రబాబు నాయుడు లింక్

వాహనంలో ఇతర నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. వాటిలో చంద్రబాబు వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేటు కూడా ఉంది. దీంతో చంద్రబాబుకు ఆ డబ్బుతో లింక్ పెట్టారు. తమను అరెస్టు చేసినప్పుడు తమకు చంద్రబాబు బంధువు అని రామకృష్ణయ్య చెప్పారని అంటున్నారు. డబ్బులతో పట్టుబడిన వాహనం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కూడా తిరిగిందని సాక్షి టీవీ వార్తాకథనం ప్రసారం చేస్తోంది. చంద్రబాబుకు పేరం హరిబాబు అత్యంత సన్నిహితుడని సాక్షి టీవీ చెబుతోంది. 2004 ఎన్నికల్లోనూ, 2009 ఎన్నికల్లోనూ చంద్రగిరి టికెట్ కోసం ప్రయత్నించి హరిబాబు విఫలమయ్యాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications