తెలంగాణ ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రచారం

తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రాంత నేతలు ఆ ప్రాంతంలో పరిస్థితుల కనుగుణంగా వ్యవహరిచేందుకు చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. ఇందువల్ల ఉప ఎన్నికల ప్రచారంలో తనకు ఎటువంటి సమస్యలు ఎదురుకాబోవని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. పైగా, ఆ మధ్య నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆయన పర్యటించారు. రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పోటీపై కొందరు సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయంలో మార్పేమీ లేదని ఆయన తెలంగాణ జిల్లాల కార్యకర్తల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications