తెలంగాణ ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు ఓటమి భయం: రాయపాటి

Rayapati Sambhasiva Rao
గుంటూరు: తెలంగాణలో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బయపడుతున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే ఇతర పార్టీలను పోటీ చేయవద్దని కెసిఆర్ అడుగుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ తన పేరు మీద వెలువడిన లేఖపై సిబిసిఐడి దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు.

గుంటూరులోని చుట్టగుంట ప్రాంతం నుంచి కొండమోడు వరకు ఉన్న రహదారిని నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై తానేమీ మాట్లాడబోనని, అది పార్టీ అధిష్టానం, పిసిసి పరిధిలోనిదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+