తమిళ నటుడు, వాణిజ్యవేత్త అర్వింద్ స్వామి భార్య గాయత్రితో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. స్వామి 1991లో మణిరత్నం తీసిన తళపతితో సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. మహాభారతంలోని అర్జునుడిని బేస్ చేసుకుని రూపొందించిన పాత్రలో అతను ఈ సినిమాలో నటించాడు. అతనికి రోజా, బొంబాయి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పరస్పర ఒప్పందంతో అర్వింద్ స్వామి, గాయత్రి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వారిద్దరికి 1994లో వివాహం జరిగింది. వారికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. అర్వింద్ స్వామి టాలెంట్ మాగ్జిమస్ సిఎండిగా ఉన్నారు. ప్రోలీజ్ ఇండియా, ఇంటర్ ప్రో ఇండియా చైర్మన్ గా కూడా ఉండేవాడు.