అమెరికాలో ఆంధ్రుడు కట్టమంచి వెంకట్ దారుణ హత్య

వెంకట్ కారులోంచి దిగడానికి యత్నిస్తున్న సమయంలోనే నలుగురు దుండగులు ఆ యువతితో కలిసి వచ్చి వెంకట్ వద్ద ఉన్న విలువైన వస్తువులు గుంజుకోవడానికి యత్నించారు. వెంకట్ పెనుగులాడుతూ వారి నుంచి తప్పించుకుని సమీపంలోని మోటెల్ వైపు పరుగులు తీశాడు. అక్కడ ఎవరూ తలుపులు తీయకపోవడంతో మరో వైపు పారిపోవడానికి వెంకట్ మళ్ళి యత్నించాడు. అంతలో దుండగులు అతనిపై కాల్పులు జరపడంతో వెంటక్ అక్కడికక్కడే మరణించాడు. కాల్పుల శబ్ధం విని ఒక మహిళ పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు ఆ ఐదుగుర్ని వెంటనే పట్టుకోగలిగారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.












Click it and Unblock the Notifications