కెసిఆర్ కు షాక్: సీమాంధ్ర నేతలతో కాంగ్రెసు ప్లాన్

K Chandrashekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దెబ్బ తీయడమే లక్ష్యంగా కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికల వ్యూహాన్ని రచించినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కొరకరాని కొయ్యగా కెసిఆర్ తయారయ్యారని కాంగ్రెసు అధిష్టానం భావిస్తోంది. తెలంగాణలోని కాంగ్రెసు సీనియర్ నాయకులకు కూడా కెసిఆర్ ప్రాబల్యం నచ్చడం లేదు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో తెరాసను చావు దెబ్బ తీసి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా తిరిగి కెసిఆర్ తలెత్తుకోకుండా చూడాలనే ఆలోచనతో కాంగ్రెసు నాయకత్వం ఉందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో దెబ్బ తింటే కెసిఆర్ కోలుకోవడం అంత సులభం కాదు.

తెలంగాణ నినాదంతో కాంగ్రెసు నాయకత్వం ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. ఇందుకు సీమాంధ్ర నాయకులను కాంగ్రెసు నాయకత్వం ఒప్పించింది. సీమాంధ్ర నాయకులకు కూడా కెసిఆర్ దెబ్బ తినడమే కావాలి. కెసిఆర్ దెబ్బ తింటే తెలంగాణ నినాదం ఉండదనే ఆలోచనతో ఉన్నారు. దీంతో శుక్రవారంనాడు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పిన వెంటనే తెలంగాణ నినాదానికి అనుకూలంగా సీమాంధ్ర నేతలు గొంతు కలిపారు.

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తమ పార్టీయేనని కాంగ్రెసు తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడింది. కెసిఆర్ తప్పుడు ఎత్తుగడల వల్ల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగిందని కాంగ్రెసు ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి దిగబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఈ ఉప ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెసు సీమాంధ్ర నేతలు మౌనం వహించే విధంగా కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+