తెలంగాణ నాదానికి సీమాంధ్ర నేతలు సై

కరుడు గట్టిన సీమాంధ్ర నేతలు శైలజానాథ్, ఆనం వివేకానంద రెడ్డి కూడా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడంలో తప్పు లేదని ఆనం వివేకానంద రెడ్డి తన ఉదారతను చాటారు. తెలంగాణ నినాదాన్ని ఉప ఎన్నికల్లో వాడకూడదని వాదిస్తూ వచ్చిన శైలజానాథ్ కూడా పూర్తిగా మారిపోయారు. ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ తీయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ నినాదాన్ని వాడాల్సిన అవసరాన్ని డిఎస్ వారికి వివరించినట్లు సమాచారం. దాన్ని అధిష్టానం ఆమోదంగా కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వేర్పాటువాదంలోనూ ఐక్యత చాటారు.












Click it and Unblock the Notifications