హైదరాబాద్: హైదరాబాదులోకి మళ్లీ స్వైన్ మహమ్మారి ప్రవేశించింది. హైదరాబాదులోని ఓ వ్యక్తికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకింది. అతన్ని చెస్ట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇతను ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. దాంతో అతను స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. నిరుడు హైదరాబాదును వణికించిన స్వైన్ ఫ్లూ వ్యాధి వర్షాలతో పాటే తిరిగి కబళించడానికి సిద్ధపడినట్లు కనిపిస్తోంది.
విశాఖపట్నంలో శుక్రవారం స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైన 30 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ స్థితిలో తిరిగి రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ వ్యాధి కబళిస్తుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.