పోలవరంపై కాంగ్రెసు: టోకరా చిరంజీవి మండిపాటు

Chiranjeevi
హైదరాబాద్: చేయి కలిపినట్లే కలిపి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి కాంగ్రెసు పార్టీ నాయకత్వం టోకరా ఇచ్చేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్వయంగా సోనియా గాంధీ చర్చలకు అహ్వానించి చిరంజీవితో చెలిమికి స్నేహ హస్తం చాచారు. దానికి చిరంజీవి సైకొట్టారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని చిరంజీవి చేస్తున్న డిమాండును స్వాగతించినట్లే స్వాగతించారు. దీనిపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో చిరంజీవి సమావేశమై హామీ కూడా పొందారు. ఇంతలోనే పరిస్థితి మారిపోయింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అటుంచి, ఆ ప్రాజెక్టుకే ఎసరు పెట్టేందుకు కాంగ్రెసు నాయకత్వం సిద్ధపడిందని ప్రజారాజ్యం వర్గాల్లో నిరసన పెల్లుబుకుతోంది.

పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెసు సీనియర్లు మెలిక పెట్టడం, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై అవినీతి ఆరోపణలు చేయడం వంటి సంఘటనలతో అసలు ప్రాజెక్టు నిర్మాణమే సందేహంలో పడినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు అక్రమాల ఆరోపణలపై ఆమె దర్యాప్తునకు కూడా ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు ఎసరు పెట్టేందుకే ఈ వ్యవహారాన్ని కాంగ్రెసు నడిపిస్తుందనే సందేహం ప్రజారాజ్యం వర్గాల్లో వ్యక్తమవుతోంది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెసు వ్యవహారాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పు పట్టారు. కావాలనే కాంగ్రెసు ఈ నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు. అంతేకాదు, ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెసు వ్యవహారశైలిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నందననే రామచంద్రయ్య ఆ ప్రకటన చేశారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+