ముఖ్యమంత్రి రోశయ్య తెలంగాణ టూర్ పై దుమారం

తాజాగా, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఒయు జెఎసి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సెంటిమెంట్ల ప్రకారం రాష్ట్ర పాలన జరగాలంటే కుదరదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సెంటిమెంట్లు అంగీకరిస్తే ఒక్కో ప్రాంతం వాళ్లు ఒక్కొ రాష్ట్రం అడుగుతారని ఆయన సోమవారం అనంతపురంలో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తెలంగాణలో పర్యటించడం ఇష్టం లేకపోతే నిరసన తెలపాలేగానీ అడ్డుకుంటామనడం సబబుకాదన్నారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తెలంగాణలో ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన ఆగదని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనను అడ్డుకుంటామని తెరాస, ఓయూ ఐకాస చెప్పడం అర్ధరహితమని ఆయన సోమవారం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పర్యటననే అడ్డుకోవడం తగదని ఆయన హితవు పలికారు.












Click it and Unblock the Notifications