వైయస్ జగన్ యాత్రకు మెలిక: అసెంబ్లీ సమావేశాలపై కినుక

వైయస్సార్ జయంతిని ఎనిమిదో తేదీన ఘనంగా నిర్వహించాలని తలపెట్టగా శాసనసభా సమావేశాలు నిర్వహించడం ఆటంకంగా మారుతున్నాయని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి అంటున్నారు. ఏడో తేదీన సమావేశాలకు హాజరై ఎనిమిదో తేదీన స్వస్థలాలకు వెళ్లడం సాధ్యం కాదని అంటున్నారు. అలాగే, 8వ తేదీన ప్రభుత్వ పరంగా లేదా పార్టీ పరంగా వైయస్సార్ జయంతి కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇది కూడా జగన్ వ్యూహానికి విరుగుడుగానే భావించాల్సి ఉంటుంది. కాగా, జగన్ వ్యతిరేకవర్గం శాసనసభ్యులు మాత్రం శాసనసభా సమావేశాల నిర్వహణ తేదీని సమర్థిస్తున్నారు. వైయస్ కు శాసనసభలో 8వ తేదీన ఘనంగా నివాళులు అర్పించడానికి వీలుగానే సమావేశాల తేదీని ఖరారు చేసి ఉంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications