Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తూర్పు గోదావరి జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు

East Godavari Dist
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధానమైన సీతపల్లి వాగు ఆదివారం ఉగ్రరూపం దాల్చింది. ఈ వాగుపై నిర్మాణంలో ఉన్న ముసురుమిల్లి ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు ఎగువ భాగంలో తాత్కాలికంగా నిర్మించిన మట్టి కట్ట కొట్టుకుపో యింది. భూపతిపాలెం ప్రాజెక్టు వద్ద రాజమండ్రి-భద్రాచలం రహదారి మునిగిపోయింది. గోకవరం మండలం సంజీవ్‌నగర్‌లోని ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి.

ముసురుమిల్లి ప్రాజెక్టు మూలంగా దేవీపట్నం ప్రధాన రహదారికి ప్రత్యామ్నాయం గా నిర్మిస్తున్న రహదారి ఛిన్నాభిన్నమైంది. దీంతో రంపచోడ వరం నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం మండలాలకు రవాణా స్తంభించింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజవొమ్మంగి మండలం జడ్డంగిలోని మడేరు వాగు దా టుతూ ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గిరిజనులు గల్లంత య్యారు. దోనెలపాలెం గ్రామానికి చెందిన కుంజం రాజబాబు, వీరకోట ప్రసాద్, వీరబోయిన శివ, గద్దా శివ, చోడి వెంక టేశ్వర్లు, విశ్వనాథం తదితరులు మడేరు వాగు దాటి జడ్డంగి లో జరిగే వారాంతపు సంతకు బయలుదేరారు. వాగు దాటుతుండగా ప్రవాహ ఉధతికి కుంజం రాంబాబు(30), వీరకోట ప్రసాద్(30) గల్లంతయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+