• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉప ఎన్నికల్లో డిఎస్ పోటీ చేయొద్దు: కోదండరామ్

By Pratap
|

Kodandaram
హైదరాబాద్‌: తెలంగాణ ప్రయోజనాలు, రాష్ట్ర సాధనపై ఏమాత్రం పట్టింపు ఉన్నా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న యాత్రను సికింద్రాబాద్‌ అమరవీరుల స్తూపం నుంచి ఆయన ప్రారంభించారు.

వివిధ రాజకీయ పార్టీల కింది స్థాయి నేతలు ఈ ఎన్నికల్లో గతంలో రాజీనామా చేసిన నాయకులకే పూర్తిగా మద్దతివ్వాలని కోరారు. గతంలో రాజీనామా చేసిన వారినే తిరిగి ఎన్నుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పోటీ చేయడం తగదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X