విశాఖపట్నం: విశాఖపట్నంలో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించిన అప్పన్న అనే వ్యక్తి భార్యకు కూడా స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో విశాఖపట్నంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖలో స్వైన్ ఫ్లూ కేసు నమోదైన రోజుకు అటూ ఇటూ హైదరాబాదులోని కూడా రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కాగా, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ మంగళవారం స్వైన్ ఫ్లూ వ్యాధి బ్రోచర్ ను విడుదల చేశారు.