తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి చిరు పార్టీ దూరమే

ఉప ఎన్నికల్లో తాను ఎటు ఉండబోతుందనే విషయాన్ని కూడా చిరంజీవి ప్రకటించలేని స్థితిలో ఉంది. కాంగ్రెసు పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని ప్రజారాజ్యం ఇది వరకే ప్రకటించింది. చిరంజీవి మద్దతిచ్చినా తీసుకునే స్థితిలో కాంగ్రెసు లేదు. తెలంగాణ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెసు సమైక్యవాది అయిన చిరంజీవి మద్దతు తీసుకోదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, రెండు, మూడు రోజుల్లో పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై తమ వైఖరి ప్రకటించనున్నారు. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ఉప ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజారాజ్యం ఇది వరకు డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications