అనుమానాస్పద స్థితిలో ఆస్పత్రిలో చేరిన సినీనటి ఫరీదా

Krishna Dist
విజయవాడ: వరంగల్ జిల్లా మహబూబాబాద్ ‌కు చెందిన ఫరీదా అనే సినీనటి అనుమానాస్పదస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిశీధి అనే హర్రర్ సినిమా షూటింగ్ కోసం కృష్ణా జిల్లా నూజివీడు మండలం దేవరగుంటకు సినిమా యూనిట్ వచ్చింది. గత పది రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతోంది. మంగళవారం ఉదయం ఐదు గంటల సమయంలో యూనిట్ సభ్యులతో కలిసి ఉన్న ఫరీదా అపస్మారకస్థితిలోకి వెళ్ళడంతో వారు ఆమెను స్థానికంగా ఉన్న ఆర్ఎంపీకి చూపించారు. మధ్యాహ్నానికి పరిస్థితి విషమించడంతో నూజివీడులోని అమెరికన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈమె ఐసీయూలో చికిత్సపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పాముకాటు వల్లే ఫరీగా అస్వస్థతకు గురైందని యూనిట్ సభ్యులు చెబుతుండగా దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్‌ కు ప్రధాన అనుచరురాలిగా వున్న ఫరీదాకు యూనిట్ సభ్యులతో తలెత్తిన విభేదాల వల్ల జరిగిన ఘర్షణలో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. పాము కాటు వల్ల ఫరీదా అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు యూనిట్ సభ్యులు చెబుతున్న మాటలు అనుమానాస్పదంగా వున్నాయని వైద్యులు తెలిపారు. అయితే ఫరీదా శరీరం మొత్తం విషంతో నిండి వుందని, ప్రస్తుతం వైద్య చికిత్సకలు కొనసాగుతున్నాయని, బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు చెబుతామన్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+