న్యూఢిల్లీ: రూపాయి రూపానికి కొత్త కళ రాబోతోంది. అంతర్జాతీయ కరెన్సీలైన డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, యెన్ ల సరసన భారతదేశ రూపాయి చేరనుంది. భారత రూపాయికి ప్రత్యేక గుర్తు అంశమై నేడు సమావేశం కానున్న కేంద్రమంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకోనుంది. హిందీ అక్షరం 'ఆర్' పోలివుండే విధంగా ఐదు నమూనా గుర్తులను కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ఇప్పటికే తయారుచేసింది. భారతీయ సంస్కృతి, వారసత్వసంపద ప్రతిబింబించేలా ఈ గుర్తులను తయారుచేసినట్టు తెలిసింది.