ఇస్లామాబాద్: ఉప ఖండంలో ఉద్రిక్తతలు నివారించేందుకు భారత్-పాకిస్థాన్ ల మధ్య కార్యదర్శుల స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు, పాక్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్‌లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. 2008 ముంబయిపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన అనంతరం భారత విదేశాంగ ఉన్నతాధికారి పాక్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ చర్చలు విజయవంతమయితే మంత్రుల స్ధాయి చర్చలకు మార్గం సుగమమవుతుంది.