న్యూఢిల్లీ: జిన్నాపై పుస్తకం రాసినందుకు బిజెపి నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ సీనియర్ నాయకుడు జశ్వంత్ సింగ్ గురువారం మరలా సొంతగూటికి చేరారు. పార్టీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, సుష్మాస్వరాజ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తొమ్మిది నెలల అనంతరం జశ్వంత్ మరలా పార్టీలోకి వచ్చారు.
పాకిస్థాన్ స్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాపై పుస్తకం రాసిన ఆయనపై గత ఏడాది ఆగస్ట్ లో బిజెపి పార్టీ నుంచి బషిష్కరించిన విషయం తెలిపిందే. పార్టీని బలపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆపార్టీ పేర్కొంది.