ఆదిలాబాద్: ఇది ఒక ప్రేమోన్మాది ఘాతుకం. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో ప్రేమించడంలేదని యువతిని అనిల్ అనే యువకుడు గొంతు కోశాడు. ఈ సంఘటనలో యువతి స్నేహితురాలికి కూడా తీవ్రగాయలయ్యాయి. ఇద్దర్ని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటన అనంతరం అనిల్ పరారయ్యాడు. గత కొద్దికాలంగా ఆ యువతిని ప్రేమించమని అనిల్ వేధిస్తున్నట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.