హైదరాబాద్: గుట్టుగా వ్యభిచారం సాగిస్తున్న ఓ ముఠాను పోలీసులు రట్టుచేశారు. నగరంలోని ఎస్‌ఆర్ నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేసి మొత్తం 16మందిని గురువారం హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. మసాజ్ సెంటర్ల పోరుతో ఇటీవల జంట నగరాల్లో వ్యభిచారం జోరుగా సాగుతోంది.
దీనిని నగర పోలీసు కమిషనర్ తీవ్రంగా తీసుకుని దాడులకు ఆదేశించారు. అయితే దొరికేవి కొన్నే, దొరకనివి ఎన్నో అన్నరీతిలో పరిస్ధితి ఉంది. వారానికి నాలుగైదు వ్యభిచారం కేసులు వెలుగులోకి వస్తున్నాయి.