హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య ఈరోజు గురువారం సాయంత్రం ఏడు గంటలకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. గ్రీన్ ల్యాండ్స్ లో ఉన్న క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులపై సీనియర్ల అనుమానాలను నివృత్తి చేయడానికి సీఎం ఈ అంతర్గత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
పోలవరం డిజైన్ మార్పు అవసరం లేదని పేర్కొంటూ తక్షణ జాతీయ హోదా కోసం కేంద్రానికి రోశయ్య లేఖ రాసినట్లు వార్తలు వెలువడిన తరుణంలో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నదని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.