ఆర్ కృష్ణయ్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం

విద్యానగర్ లోని బిసి సంక్షేమ భవన్ వద్ద దీక్షకు కూర్చున్న కృష్ణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీరియంబర్స్ మెంట్, ఉపకార వేతనాల బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య జీవో విడుదల చేయాలని, అంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇదివరకే అనుమతి లభించినా ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఈ 33 శాతం చట్టసభల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications