తనపై కుట్ర చేస్తున్నారని రోశయ్య సంచలన ఆరోపణ

తనను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న భావం రోశయ్య మాటల్లో వ్యక్తమయింది. ముఖ్యమంత్రి నోటి వెంట కుట్ర అనే మాట రావడం పెద్ద విషయంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఉదహరించలేదు. ఉపకార వేతనాలు, బోధన రుసుముల చెల్లింపు విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై ఆయన కొద్దిరోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను బీసీ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నా మంత్రులు సక్రమంగా స్పందించడంలేదని కూడా తప్పుపట్టారు. దాంతో గురువారం బీసీ మంత్రులంతా కలసికట్టుగా విలేకరుల సమావేశం పెట్టి బీసీలకు ప్రభుత్వం ఏం చేస్తోందీ వివరించారు. వై.ఎస్ హయాంలోనూ బకాయిలు ఉన్నాయనే వాస్తవాన్ని గణాంకాలతో వారితోనే చెప్పించారు. అదే సమయంలో ఇటు తాను కూడా ప్రత్యక్షంగా విమర్శలకు దిగారు.












Click it and Unblock the Notifications