నేడే కామిక ఏకాదశి... వీరికి స్వర్ణయుగం మొదలు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం నాడు కామిక ఏకాదశిగా చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో ఈరోజుకు చాలా ప్రత్యేకత ఉంది. నేడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, బుధుడు కర్కాటక, సింహరాశిలో ప్రచారం చేస్తున్నారు.శుక్రుడు కన్యారాశి లోను, శని మీనరాశి లోను, రాహు కుంభరాశి లోను, కేతువు సింహరాశి లోను సంచారం చేస్తున్నారు.

నేడు గ్రహాల స్థితి ఇలా

కుజుడు మిధున రాశిలో, గురువు కర్కాటక రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహాల స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం ఉంటుంది. నేడు గ్రహాల స్థితితో ద్వాదశ రాశులవారికి ఎలాంటి ఫలాలు ఉంటాయో తెలుసుకుందాం.

today rashiphalalu Know how kamika ekadashi affects career and finances of all 12 zodiac signs

మేషరాశి: నేడు మేష రాశి జాతకులకు మధ్యమంగా ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి వాదనలు ఉంటాయి. పనిలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. గృహ సంబంధిత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

వృషభ రాశి: నేడు వృషభ రాశి జాతకులకు శుభప్రదమైన రోజు ఈరోజు నేను వృషభ రాశి వారి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది.ఆస్తి సమస్యలు తొలగిపోతాయి.

మిధున రాశి: మిధున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగం చేసే వారికి పై అధికారుల సహకారం లభిస్తుంది. నేటి వ్యవసాయం, డ్రైవింగ్, వస్త్ర పరిశ్రమలు వ లాభాలు ఉంటాయి.

కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి నేడు శుభప్రదమైన రోజు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకమైన రోజు. కుటుంబ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఈరోజు అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సింహరాశి: సింహ రాశి వారికి మానసిక చింతల నుండి ఉపశమనం లభిస్తుంది కామిక ఏకాదశి మీ అన్ని సమస్యలకు పరిష్కారాలు సూచిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి జీవితం స్వర్ణ మయంగా మారుతుంది. నేడు వీరికి అధిక లాభాలు వస్తాయి.

కన్యారాశి: కన్యా రాశి వారికి కామిక ఏకాదశి చాలా ఫలవంతమైన రోజుగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్తలు వింటారు. చేసే పనిలో వేగం పెరుగుతుంది. ఉత్సాహంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.

తులారాశి: తులా రాశి వారికి కామిక ఏకాదశి చాలా అద్భుతమైన రోజుగా ఉంటుంది. నేడు మీ జీవితం సానుకూల సంఘటనలతో నిండి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. తులారాశి జాతకులు నేడు శుభవార్తలు వింటారు.

వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువతకు శుభవార్తలు మాత్రం స్వాగతం పలుకుతాయి ఆర్థిక విషయాల పైన జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: ధనస్సు రాశి వారు నేడు పనులను ప్రణాళిక చేసుకోవడం పైన దృష్టి పెడతారు. విద్యార్థులలో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని చూస్తారు. పనిచేసే చోట మీ పనికి గుర్తింపు వస్తుంది.

మకర రాశి: మకర రాశి జాతకులకు నేడు మంచి ఫలితాలను చూస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాజకీయాలలో ఉన్న వారికి ఎక్కువ గౌరవ లభిస్తుంది. పనిలో ఇతరుల పైన ఆధారపడడం మానుకుంటే మంచిది.

సింహరాశిలో ఆగస్టు 17న సూర్య గోచారం.. వీరింట సిరి సంపదల ప్రకాశం!
సింహరాశిలో ఆగస్టు 17న సూర్య గోచారం.. వీరింట సిరి సంపదల ప్రకాశం!

కుంభ రాశి: కుంభరాశి వారికి ఈ రోజు ఒత్తిడితో కూడిన రోజుగా ఉంటుంది. కాబట్టి ఆందోళనతో ఏ పని చేయకుండా ఉంటే మంచిది. కుటుంబ విషయాలను అపరిచితులతో పంచుకోకుండా ఉంటే మంచిది. కొన్ని చిరకాల కోరికలు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

మీనరాశి: మీన రాశి వారికి నేడు చాలా అనుకూలమైన రోజు ఆర్థిక విషయాల పైన ఈరోజు శ్రద్ధ పెట్టి పని చేస్తే మంచిది విద్యార్థులకు మానసిక భారం నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ప్రయత్నాలు చేసే వారు భార్య సలహా తీసుకుంటే మంచిది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+