సూపర్ మోడల్ వివేకా ఆత్మహత్య: బాయ్ ఫ్రెండ్ పై అనుమానం

వివేకాకు, గౌతంకు మధ్య ఏ విధమైన సంబంధం ఉందనే కోణంలో పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఈ నెల 24వ తేదీన జరిగిన కలయికపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. కామసూత్ర మోడల్ వివేకా బాబాజీ దారుణంగా మరణించిన విషయం తెలిసిందే. బాంద్రాలోని హోటల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ శుక్రవారం ఆమె మృతదేహం కనిపించింది. గౌతం తెగదెంపులు చేసుకోవడంతో మానసికంగా కృంగిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. వివేకా ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.












Click it and Unblock the Notifications