ముఖ్యమంత్రి రోశయ్య మాటలే నేను అన్నాను: ముద్దు

గతంలో చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు, వాజ్పేయిలపై రోశయ్య చేసిన విమర్శలు చూస్తే ఎవరు ఏ స్థాయిలో మాట్లాడారో తెలుస్తుందని ఆయన అన్నారు. రోశయ్యను కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన చెప్పారు. దాడులు చేయించడం తమ పార్టీ సిద్ధాంతం, సంప్రదాయం కాదని ఆయన అన్నారు. తన ఇంటిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రోశయ్యనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అప్రజాస్వామికంగా కాంగ్రెసు దాడులు చేయిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications