కెటి రామారావుపై హరీష్ రావు కుట్ర: పొన్నం ప్రభాకర్

ఎన్నికలను నిలిపివేయడంలో కాంగ్రెస్ కుట్ర ఉందని అంటున్న తెరాస అధినేత కేసీఆర్, ముందు ఆ ఆరోపణలను నిరూపించాలని ప్రభాకర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, అయితే హరీష్‌రావు తన పరిధిని దాటి మాట్లాడుతున్నాడని అన్నారు. కేసీఆర్ తనయుడు రామారావును అణగదొక్కాలని హరీష్‌రావు ప్రయత్నించాడని, దీనిలో భాగంగానే ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రయత్నించాడని ఆయన విమర్శించారు.
తెరాసలో రెండో స్థానంలో ఉన్న హరీష్ రావు కెటిఆర్ వస్తే తన స్థానం పోతుందని భయపడ్డారని, దాంతో కెటిఆర్ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. కెటిఆర్ ను సిరిసిల్లలో పోటీ చేయించి రాజకీయంగా దెబ్బ తీయడానికి కూడా ప్రయత్నించారని ఆయన వ్యాఖ్యానించారు. సిరిసిల్ల, వేములవాడ ఎన్నికల వాయిదా వెనక కాంగ్రెసు కుట్ర ఉందని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications