ప్రచారంలో డిఎస్ వీర తెలంగాణవాది పలుకులు

కాగా, డిఎస్ శ్రీనివాస్ తెలంగాణను తెచ్చేది తానేనని చెబుతున్నారు. తనను మించిన తెలంగాణవాది లేడని, ఈ విషయాన్ని తాను పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆయన బుధవారం కూడా అన్నారు. 2014 నాటికి తెలంగాణ రావడం ఖాయమని ఆయన చెబుతున్నారు. 2014లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతాయని ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, తాను గెలిస్తే మంచి స్థానంలో ఉంటానని పదే పదే చెబుతున్నారు. తాను గెలిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తాజాగా బుధవారం నాడు కూడా చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ డిప్యూటి సిఎం అవుతారని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అనుచరులు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏమైనా, ఇంత కాలం తెలంగాణ ఊసు కూడా ఎత్తని డిఎస్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చే సరికి తెలంగాణ పదం తప్ప మరోటి ఎత్తుకోవడం లేదు.












Click it and Unblock the Notifications