తగిన సమయంలో కుట్రదారులను బయటపెడ్తాం: మంత్రులు

విద్యార్థులను చులకనగా చూసే కశాశాలలపై కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు. కళాశాలల పనితీరును సమీపంగా పరిశీలిస్తామని వారు చెప్పారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారమే దఫాలుగా ఫీజులు విడుదల చేస్తున్నామని వారు చెప్పారు. కాగా, ఫీజుల రీయంబర్స్ మెంటుపై ఏర్పడిన మంత్రివర్గ సంఘం బుధవారం సమావేశమైంది. కొత్త విధివిధానాలను కమిటీ నిర్ధారించింది. వాటిని గురువారంనాటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదిస్తారు. లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న తల్లిదండ్రుల విద్యార్థులకు ఫీజుల రీయంబర్స్ మెంట్ జరిగే ప్రతిపాదనను సంఘం చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications