హైదరాబాద్: వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరంగల్, ప్రకాశం జిల్లాల పర్యటన రద్దు అయింది. వాతావరణం సరిగ్గా లేదని చంద్రబాబు హెలికాప్టర్ ప్రయాణానికి ఏటీసీ అనుమతి నిరాకరించింది. వరంగల్‌లో పార్టీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి కుమార్తె వివాహానికి, ఒంగోలులో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శిద్ధారాఘవరావు కుమార్తె వివాహానికి చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది.