తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల మధ్య విభేదాలు

హైదరాబాదులోని జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జరుగుతున్న రాత పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ మంత్రుల వాదనలను సీమాంధ్ర మంత్రులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో మాదిరిగానే హైదరాబాదులో కూడా పరీక్ష జరగాలని, పరీక్షను వాయిదా వేయకూడదని వారు వాదించినట్లు తెలుస్తోంది. అయితే, పరీక్ష వాయిదాకే ప్రభుత్వం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2014 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన ప్రకటనను మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications