రాజమండ్రి: మిత్రుడ్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించింది. సత్యనారాయణ అనే హోంగార్డు తొలుత తన స్నేహితుడ్ని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామంలో జరిగింది.
పాత గొడవలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. మిత్రుడ్ని హత్య చేసిన సత్యనారాయణ ఇంటికి వెళ్లి బ్లేడుతో కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.