ఏడాది ఆఖరునాటికి నెంబర్ వన్ కావాలని కోరిక: సైనా

ప్రపంచ చాంపియన్ షిప్, కామన్ వెల్త్, ఆసియా క్రీడల్లో రాణించాలనేది తన లక్ష్యమని ఆమె చెప్పారు. అందుకు తాను చాలా శ్రమ పడాల్సి ఉంటుందని, అయితే బాగా ఆడగలననే విశ్వాసం ఉందని ఆమె అన్నది. విజయ గర్వం తలకెక్కకుండా చూసుకోవడం తనకు ముఖ్యమని ఆమె అన్నారు. తన తండ్రి తనను డాక్టర్ చేయాలనుకున్నారని, అయితే తాను బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని అయ్యాయని, అయితే ఏదో చేయాలో నీ ఇష్టం పూర్తి ధ్యాస, కృషి పెట్టాలని చెప్పారని ఆమె అన్నది.
తన తల్లిదండ్రుల పట్ల తనకు గర్వంగా ఉందని, రాకెట్లు లేదా షటిల్స్ విషయంలో తాను ఏ రోజూ రాజీ పడలేదని, అవి ఎంతో విలువైనవని, ఆ విషయంలో వారు చేసిన త్యాగం తనకు అర్థమవుతుందని, తండ్రి అప్పులు చేసేవారని ఆమె వివరించారు. తన తల్లి చాలా బలమైందని, రోజర్ ఫెదరర్ గురించి ఆలోచించాలని చెబుతూ ఉంటుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications