అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలి: కోదండరామ్

ఉప ఎన్నికలు ముగిసే వరకు శాసనసభా సమావేశాలను వాయిదా వేయాలని గవర్నర్, స్పీకర్,ఇసిలను కలిసి తాము కోరుతామని ఆయన చెప్పారు. షెడ్యూల్ తో సంబంధం లేకుండా కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులెవరూ శాసనసభా సమావేశాలకు హాజరు కావద్దని ఆయన కోరారు. ఒకవేళ వారు హాజరైతే వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణవాదాన్ని తలకెత్తుకున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications