వైయస్ జగన్ ఓదార్పు యాత్ర: మొయిలీ చేయి దాటింది

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చేయి దాటిపోయినట్లే ఉంది. జగన్ ను ఇక బుజ్జగించే వ్యవహారాలు గానీ ఆయనను వెనకేసుకొచ్చే విషయాలు గానీ ఏమీ ఉండవని తేలిపోయింది. జగన్ విషయంలో పట్టువిడుపులు ఉండవని కూడా అర్థమవుతోంది. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వబోమని సోనియా గాంధీ జగన్ తో కచ్చితంగా చెప్పినట్లు తెలుస్తోంది. తానే స్వయంగా రంగంలోకి దిగి సోనియా జగన్ ను కట్టడి చేసేందుకు పూనుకున్నట్లు చెబుతున్నారు.

పార్టీలో ఉండదలుచుకుంటే తమ మాట వినాల్సిందేనని జగన్ తో సోనియా చెప్పినట్లు సమాచారం. దీంతో వీరప్ప మొయిలీ జగన్ విషయంపై మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. జగన్ గురించి ఏమీ మాట్లాడకూడదని సోనియా నుంచి అధిష్టానానికి చెందిన నాయకులకు కూడా ఆదేశాలు వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో బుధవారం సాయంత్రం జగన్ యాత్ర గురించి అడిగినప్పుడు వీరప్ప మొయిలీ సమాధానం చెప్పలేదు. జగన్ గురించి అటు గానీ ఇటు గానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. దీన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+