పాట్నా: బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా గండక్ నదిలో పడవ మునిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 45 మంది గల్లంతయ్యారు. వీరంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషాద సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. రన్హా నుంచి భగ్వాన్ పూర్ కు పడవ వెళ్తుండగా ఘోరియా ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
నది నుంచి ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు. గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సీనియర్ అధికారులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.