డి శ్రీనివాస్ పై రోశయ్య, సీమాంధ్ర నేతల గుర్రు

కాగా, తెలంగాణపై సీమాంధ్ర నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ ఆ విధంగా మాట్లాడడం సరి కాదని వారు అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్ర మంత్రి గాదె వెంకట రెడ్డి వంటి వారు ఇప్పటికే తమ నిరసనను వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, తానే తెలంగాణను తెస్తానని శ్రీనివాస్ నిజామాబాద్ ప్రజలకు చెప్పుకుంటున్నారు. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడడం సరి కాదని సీమాంధ్ర నేతలు అంటున్నారు. అయితే, అది డిఎస్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పిసిసి అధికార ప్రతినిధి పాలడుగు వెంకటరావు అన్నారు.












Click it and Unblock the Notifications