హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్, చంద్రబాబులకు చంద్రశేఖర రావు కొత్త సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కొత్త సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలమంటూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వారిద్దరు నివేదిక ఇస్తే తాము ఎన్నికల నుంచి తప్పుకుంటామని ఆయన చెప్పారు. ఆ పార్టీల అభ్యర్థులనే ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. తమ అభ్యర్థులెవరూ నామినేషన్లు వేయరని ఆయన చెప్పారు. ఇక ఈ నెల ఏడో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, ఈ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానం చేస్తే మా అభ్యర్థులు ఒకవేళ నామినేషన్లు వేసినా ఉపసంహరించుకుంటామని ఆయన సవాల్ చేశారు.

గురువారమిక్కడ తెరాస కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం గంభీర్‌రావుపేట మండల తెదేపా అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యులు దయాకర్‌రావు, ఎంపీటీసీ సభ్యులు లింగంయాదవ్‌, సురేందర్‌రావు, వనపర్తి నియోజకవర్గం నుంచి పరమేశ్‌నాయి తదితరులు కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డి.శ్రీనివాస్‌, చంద్రబాబు నాయుడులు ఎన్నికల ముందు పిల్లిమొగ్గలు, కుప్పిగంతులు వేస్తున్నారంటూ ద్వజమెత్తారు. డి.శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజలు కోరుతున్నపుడు, ఉద్యమానికి అవసరమైనపుడు మాట్లాడలేదని, విద్యార్థులను పోలీసులు గొడ్లను కొట్టినట్టు కొట్టినా నోరు విప్పలేదన్నారు. అలాంటి డీఎస్‌ ఇప్పుడు తెలంగాణ వచ్చేవరకు నిద్రపోనంటూ బీరాలు పలుకుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి రోశయ్యలు చీకట్లో షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకుంటారని కేసీఆర్‌ విమర్శించారు. శాసనసభలో తెరాస లేకపోతే తెలంగాణ అంశాలపై కూడా చర్చించడంలేదని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X