అరెస్టుకు ప్రయత్నం: విజయశాంతి లొంగిపోతారా?

విజయశాంతి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అరెస్టు చేసేందుకు పోలీసులు శుక్రవారం విజయశాంతి నివాసానికి వెళ్లారు. అయితే ఆమె ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. తెలంగాణకు అడ్డం వస్తే అడ్డంగా నరికేయండంటూ చేసిన వ్యాఖ్యను తీవ్రంగా తీసుకున్న ఎన్నికల సంఘం (ఇసి) ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు, సినీనటి విజయశాంతిపై పోలీసులు సుమోటోగా గురువారం కేసు నమోదు చేశారు. మాటలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్య చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఉన్న బంజారాహిల్స్ పోలీసులను పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ఆదేశించారు. దీంతో గురువారం రాత్రి పోలీసులు విజయశాంతిపై ఐపీసీ 505(2), 153(ఎ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications