వైయస్ జగన్ యాత్రకు నా అనుమతి అక్కర్లేదు: సిఎం

శాసనసభా సమావేశాలను వాయిదా వేయాలని చాలా మంది శాసనసభ్యులు కోరుతున్నారు కదా అని మీడియా ప్రతినిధులు అడిగితే, చాలా మంది అంటే ఎంత మంది కోరుతున్నారు, ఎవరెవరు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీరు ఏదేదో రాస్తారు, వాటికి నన్ను సమాధానం చెప్పమంటారని ఆయన అన్నారు. ఈ నెల 8వ తేదీన దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉన్నందున 7వ తేదీ నుంచి తలపెట్టిన శాసనసభా సమావేశాలను వాయిదా వేయాలని కొంత మంది శాసనసభ్యులు కోరారని, అయితే, ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శాసనసభా సమావేశాల తేదీలను ఖరారు చేశామని, వాటిని వాయిదా వేయడం కుదరదని తాను చెప్పానని ఆయన వివరించారు. వైయస్ జయంతికి , శాసనసభా సమావేశాల నిర్వహణకు సంబంధం లేదని ఆయన చెప్పారు.
ఈ నెల 8వ తేదీన శాసనసభలో వైయస్ సేలను గుర్తు చేసుకోవడానికి వీలవుతుందని, సాయంత్రం వైయస్ జయంతి సభ కూడా ఉందని ఆయన చెప్పారు. తాను, పిసిసి అధ్యక్షుడు కలిసి ఉప ఎన్నికల్లో పోటీకి పెట్టాల్సిన అభ్యర్థులపై చర్చించామని, దాన్ని తాము సోనియా గాంధీ ముందు పెడతామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థులుగా పాతవారినే ఎంపిక చేస్తారా అని అడిగితే అది చర్చల తర్వాత తెలుస్తుందని ఆయన సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications