బిసి నేత కృష్ణయ్య ఆందోళన వెనక వైయస్ జగన్?

కాగా, జగన్ తో భేటీ అనంతరం కృష్ణయ్య మాట్లాడి వైనాన్ని బట్టి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. తన దీక్షకు మద్దతిచ్చినవారందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నానని, అందులో భాగంగానే తాను జగన్ ను కలిశానని కృష్ణయ్య చెప్పారు. తమ భేటీలో ఏ విధమైన రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫీజుల రీయంబర్స్ మెంటుపై కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. దీక్షకు ముందు ఆర్. కృష్ణయ్యతో సాక్షి టీవీ చానెల్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి కృష్ణయ్య దీక్ష వెనక జగన్ పాత్ర తెలిసిపోతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications