వైయస్ జగన్ ఓదార్పునకు గాలి జనార్దన్ రెడ్డి చేయూత

Gali Janardhan Reddy
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో మంతనాలు జరిపారు. ఓదార్పు యాత్రకు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో జగన్ గాలి జనార్దన్ రెడ్డి సహకారాన్ని కోరినట్లు సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ దుష్యంత్‌రెడ్డి కుమార్తె పుట్టిన రోజు వేడుకలో పాల్గొనేందుకు జనార్దనరెడ్డి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. ఈ కార్యక్రమానికి జగన్ కూడా హాజరయ్యారు. ఈ వేడుక వేదికగానే జగన్, గాలి జనార్దనరెడ్డి ఏకాంతంగా మాట్లాడుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

పార్టీ అధిష్టానం అనుమతి నిరాకరించినా తాను ఓదార్పు యాత్రను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు జగన్ గాలి జనార్దన్ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. తన పూర్తి సహకారం ఉంటుందని గాలి జనార్దన్ రెడ్డి జగన్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీకి బద్ధశత్రువు అయిన గాలి జనార్దన్ రెడ్డితో జగన్ చేతులు కలపడానికి సిద్ధపడినట్లు ఈ మంతనాలను బట్టి అర్థమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతితో దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను ఒకే వేదిక మీదికి తెచ్చి సహాయం అందించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జగన్ కు సూచించినట్లు సమాచారం. అయితే ఆ సూచన జగన్ కు నచ్చలేదని, దాంతో అధిష్టానం ఆదేశాలను ధిక్కరించి జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+